ఐపీఎల్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న Yupp TV.

దేశంలోని క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న టోర్నమెంట్.. ఐపీఎల్. కరోనా కారణంగా ఆలస్యంగా ప్రారంభం అవుతున్న ఐపీఎల్ సీజన్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. మొత్తం తొమ్మిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఐతే దుబాయ్ లో జరుగుతున్న కారణంగా ఐపీఎల్ మ్యాచులని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేదు. అదీగాక కరోనా వల్ల అందరూ టీవీల్లో చూడాల్సిందే. ఐతే ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులని Yupp టీవీ సొంతం చేసుకుంది.

ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ ని ప్రత్యక్షప్రసారం చేయడం సంతోషంగా Yupp TV ఉందని చెబుతోంది. మొత్తం 60మ్యాచులని టీవీలో చూడవచ్చు. ఇంటర్నెట్ లో దొరికే ఈ టీవీలో 250రకాల ఛానెల్స్ అందుబాటులో ఉన్నాయి. 3000కి పైగా సినిమాలు చూడవచ్చు. ఇంకా వెబ్ సిరీస్ లు సైతం ఉన్నాయి. మొత్తం 14భాషల టీవీ కార్యక్రమాలని ఇంటర్నెట్ ద్వారా అందిస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచుల ప్రత్యక్ష ప్రసారంతో Yupp TVలో మరో మైలు రాయి చేరినట్టే.సెప్టెంబరు 19వ తేదీ నుండి ఐపీఎల్ ప్రారంభం అవుతుంది.