T-20 World cup Semi Final : పాక్ కు షాక్ ! ఫైన‌ల్ లో ఆస్ట్రేలియా

-

దుబాయ్ వేదిక జ‌రిగిన టీ ట్వంటి వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో పాకిస్థాన్ జ‌ట్టు కు షాక్ త‌గిలింది. వ‌రుస విజ‌యాల‌తో జోరు మీద ఉన్న పాక్ జ‌ట్టు ఆస్ట్రేలియా జ‌ట్టు షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా జ‌ట్టు పాక్ జ‌ట్టు ను మొద‌ట బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన పాక్ జ‌ట్టు ఓపెన‌ర్లు శుభారంభాన్ని ఇచ్చారు.

మ‌హ్మ‌దు రిజ్వాన్ తో పాటు బాబ‌ర్ అజామ్ తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి 71 ప‌రుగులు సాధించారు. అలాగే ఫ‌ఖ‌ర్ జామ‌న్ కూడా చివ‌ర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌టం తో పాక్ జట్టు నాలుగు వికెట్ల ను కొల్పోయి 176 ప‌రుగులు చేసింది. దీంతో 177 ప‌రుగుల భారీ ల‌క్షం తో బ‌రి లోకి దిగిన ఆస్ట్రేలియా కు ఆది లో నే షాక్ త‌గిలింది. ష‌హీన్ ఆఫ్రీదీ బౌలింగ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ గోల్డెన్ డౌక్ అవుట్ అయ్యాడు. దీంతో విజ‌య భారం మొత్తం డేవిడ్ వార్న‌ర్ త‌న భుజాల‌పై వెసుకున్నాడు.

 

వార్న‌ర్ 49 (30) 3 సిక్స్ లు, 3 ఫోర్లో ఆడి ఆర్థ శ‌త‌కం కాకుండానే అవుట్ అయ్యాడు. త‌ర్వాత వ‌చ్చిన స్టీవ్ స్మీత‌, మాక్స్ వెల్ వెను వెంట‌నే అవుట్ కావ‌డం తో ఆస్ట్రేలియా క‌ష్టాల‌లో ప‌డింది. కాని చివ‌ర‌ల్లో మార్క‌స్ స్టోనీస్ 40 (31) తోపాటు మాథ్యూ హెడ్ 41 ప‌రుగులు కేవ‌లం 17 బంతుల లో విద్వంస‌క ఇన్నింగ్స్ ఆడి ఆస్ట్రేలియా ను ఫైన‌ల్ కు చేర్చాడు. దీంతో మాథ్యూ హెడ్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version