టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సంప్రదించింది. రోహిత్ ట్రేడింగ్ కోసం DC ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇందుకు ముంబై మేనేజ్మెంట్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. కాంట్రాక్టు డీల్ ఉన్నందున రోహిత్ ను వదులుకోలేమని ముంబై ఫ్రాంచైజీ ఢిల్లీకి తెలిపింది. ఈ సంప్రదింపుల వెనక DC మెంటార్ సౌరవ్ గంగూలీ ఉన్నట్లు టాక్.
అంతేకాదు, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ తిరిగి SRHకు వచ్చేయాలని అతడి తెలుగు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆయన తోలుత హైదరాబాద్ తరపున ఆడారని, 2009లో టైటిల్ కూడా వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు SRHకు మన దేశ స్టార్ ప్లేయర్, కెప్టెన్ అవసరం ఉందని, రోహిత్ చక్కగా సరిపోతారని పోస్టులు చేస్తున్నారు. డిసెంబర్ 19 వేలం తర్వాత కూడా ట్రేడింగ్ కు అవకాశం ఉందని, SRHకు వస్తే బాగుంటుందని చెబుతున్నారు.