గ్రౌండ్ లో స్పిన్నర్ గా మ్యాజిక్ చేసే టీమ్ ఇండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ తనలోని మరో టాలెంట్ ను బయటపెట్టారు. శ్రీరాముడు, హనుమాన్ చిత్రాలను గీసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. నెటిజన్ ఈ ఫోటోలను షేర్ చేయగా…కుల్దీప్ పెయింటింగ్ అద్భుతంగా వేశాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, అయోధ్యలో నేటి నుంచి ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ముందస్తు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నేడు ప్రాయశ్చిత్త, కర్మకుటి పూజలు జరగనుండగా రేపు ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశిస్తుంది. 18వ తేదీన తీర్థపూజ, జలయాత్ర, గంధాదివాస్…. ఆ మర్నాడు 19న ఔషధదివాస్, కేసరదివాస్, గ్రితదివాస్, ధాన్యదివాస్ పేరుతో పూజలు ఉంటాయి. 20న షర్కారదివాస్, ఫలదివాస్, పుష్పదివాస్…. 21న మధ్య దివాస్, శయ్యదివాస్ కార్యక్రమాలు జరుగుతాయి.
అటు రామమందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో లక్నో నుంచి అయోధ్యకు ఈ నెల 19న హెలికాప్టర్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ హెలికాప్టర్ లో 8-18 మంది ప్రయాణించొచ్చని అధికారులు వెల్లడించారు. అయితే ఇందుకు ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని….సంబంధిత రేట్లను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఈ హెలికాప్టర్ల ద్వారా లక్నో నుంచి అయోధ్యకు 30-40 నిమిషాల్లో చేరుకోవచ్చు.