చెపాక్ స్టేడియంలో CSK కు ఘోర అవమానం ఎదురు అయింది. చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్‌గా ఉన్న చెపాక్‌లో దశాబ్ద కాలంపైగా ఎవరూ CSKని బీట్ చేయలేదు. కానీ.. ఈ సీజన్ మొదట్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చెన్నైని ఇక్కడ 17 ఏళ్ల తర్వాత తొలిసారి బీట్ చేసింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ ఇదే వేదికపై 15 ఏళ్ల తర్వాత CSKని మట్టి కరిపించింది.
ఇది ఇలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో గెలుపొందింది. IPL సీజన్‌లో ఢిల్లీ వరుసగా మూడో విజయం అందుకుంది. ఈ విజయాలపై DC కెప్టెన్ అక్షర్ పటేల్ హర్షం వ్యక్తం చేశాడు. హ్యాట్రిక్ విజయాలు దక్కుతాయని తాను అస్సలు ఊహించలేదన్నాడు. సమష్టి ప్రదర్శనతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా మూడు మ్యాచ్‌లకు మూడు గెలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.