సన్రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో సతమాతమవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటివరకు హైదరాబాద్ వరుసగా 4 ఓటములను చదివి చూసింది. ఈ టోర్నమెంట్లో మొత్తం ఐదు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. ఆదివారం రోజున గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ చేతిలో దారుణంగా ఓడిపోయింది హైదరాబాద్. బౌలింగ్ అలాగే బ్యాటింగ్… రెండు విభాగాల్లో అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచిన హైదరాబాద్.. ఓటమి పాలైంది. దీంతో పాయింట్లు పట్టికలో హైదరాబాద్ చిట్ట చివరన నిలిచింది.
- ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములు..
- నిన్న గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో SRHపై గుజరాత్ టైటన్స్ ఘన విజయం
- 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పురుగుల లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్
- 61 పరుగులతో గిల్, 49 రన్స్ తో సుందర్, 35 పరుగులతో రాణించిన రూథర్ ఫర్డ్
- పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్