రెండో వన్డేలో ఓటమి, సీరీస్ కోల్పోయిన టీం ఇండియా…!

-

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో టీం ఇండియా23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కివీస్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్, హెన్రీ నికోలస్ మంచి ఆరంభం ఇచ్చారు.

గుప్తిల్ 79 బంతుల్లో 79 పరుగులు చేయగా నికోలస్ 59 బంతుల్లో 41 పరుగులు చేసారు. ఇద్దరూ తొలి వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యం నేలకోలోపారు. నికోలస్ అవుట్ అయిన తర్వాత గుప్తిల్ దూకుడుగా ఆడుతూ బ్లందేల్ తో కలిసి స్కోర్ బోర్డు పెంచాడు. బ్లందేల్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సీనియర్ ఆటగాడు టేలర్ జట్టుని ఆదుకున్నాడు. లోయర్ మిడిల్ ఆర్డర్ విఫలమైనా సరే ఆఖర్లో జమిసన్ తో కలిసి జట్టుకి మంచి స్కోర్ అందించాడు.

భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ స్వేచ్చగా ఆడలేకపోయింది. ఆ తర్వాత 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మూడు పరుగులకే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు. ఇక ఆరు పరుగులతో జోరు మీదున్న యువ ఆటగాడు పృథ్వీ షా బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ ఎక్కువ సేపు క్రేజ్ లో నిలవలేకపోయాడు.

సౌతీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. పృథ్వీ షా అవుట్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అయ్యర్ (52) జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ ని ముందుకి నడిపించాడు. తొలి మ్యాచ్ లో మెరుపులు మేరిపించిన రాహుల్ ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జాదవ్ కూడా ఆకట్టుకోలేదు. అయితే జడేజా మాత్రం కివీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలబడ్డాడు.

ఠాకూర్ తో కలిసి దాదాపు 30 పై చిలుకు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే దూకుడు మీదున్న ఠాకూర్ ని గ్రాండ్ హోం అవుట్ చేసాడు. ఠాకూర్ అవుట్ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సైని (45)మాత్రం చెలరేగిపోయాడు. ఫోర్లు సిక్సులతో జట్టుని గెలిపించినంత పని చేసాడు. అయితే కీలక సమయంలో వికెట్ చేజార్చుకున్నాడు. జమిసేన్ బౌలింగ్ లో వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన చాహల్ కాస్త పర్వాలేధనిపించినా,

జడేజాకు సహకారం లేకపోవడంతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో జడేజా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనవసర పరుగుకి ప్రయత్నం చేసి చాహల్ రనౌట్ అయ్యాడు. కివీస్ ఆఖర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జట్టు ఓటమి ఖాయమైంది. చివర్లో జడేజా  క్యాచ్ అవుట్ అవడంతో జట్టు ఓటమి లాంచనమై౦ది. దీనితో టీం ఇండియా వన్డే సీరీస్ కోల్పోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version