IPL 2024 : ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ వేలాల్లో ఐదుగురు క్రికెటర్లు అత్యధికంగా ఆర్జించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ వేలం ద్వారా ఇప్పటివరకు రూ. 54.15 కోట్లు ఆర్జించారు.
యువరాజ్ సింగ్ రూ. 48.10 కోట్లు, ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ రూ. 45.30 కోట్లు సంపాదించారు. దినేష్ కార్తీక్ రూ. 44.35 కోట్లు ఆర్జించారు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టాక్స్ రూ. 43.25 కోట్లు సంపాదించారు.
కాగా, వచ్చే ఐపీఎల్ సీజన్ కి ఈ నెల 19వ తేదీన దుబాయ్ వేదికగా కోక కోలా అరేనాలో ఐపీఎల్ వేలం జరిగింది.333 ప్లేయర్స్ లో 77 మంది ప్లేయర్స్ ని వివిధ ఫ్రాంచైజ్ లు దక్కించుకున్నాయి.మిచెల్ స్టార్క్ ని కోల్కతా నైట్ రైడర్స్ 24.75 కోట్లకి దక్కించుకుంది.ఇది ipl చరిత్రలోనే అత్యధిక ధర కావడం విశేషం.అలాగే ప్యాట్ కమిన్స్ ని సన్రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లకు దక్కించుకుంది.