మునుగోడు కౌంటింగ్ సెంటర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆకస్మాత్తుగా వెళ్లిపోయారు. మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుండగా ఆమె బయటకు వచ్చారు. అయితే ఆమె అందరికంటే ముందుగానే కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. మొదటి రెండు రౌండ్లలో పాల్వాయికి బిజెపి, టీఆర్ఎస్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
కాగా మూడో రౌండ్ కౌంటింగ్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ మరియు తొలి రౌండు లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ఆదిత్యం లోకి రాగా… ఆ తర్వాత బిజెపి పుంజుకుంది.