ఇప్పుడంటే సినీతారలు అందుకునే పారితోషికాలు లక్షలు, కోట్లల్లో ఉంటున్నాయి కానీ 1970ల కాలంలో వేలల్లో తీసుకునేవారు. ఆ సమయంలోనే శ్రీదేవి.. రజనీకాంత్ కంటే ఎక్కవగా పారితోషికం తీసుకున్నారట.
అలనాటి అందాల తార శ్రీదేవిని అభిమానులు భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్ అని సంబోధిస్తుంటారు. ఇప్పుడంటే సినీతారలు అందుకునే పారితోషికాలు లక్షలు, కోట్లల్లో ఉంటున్నాయి కానీ 1970ల కాలంలో వేలల్లో తీసుకునేవారు. ఆ సమయంలోనే శ్రీదేవి.. రజనీకాంత్ కంటే ఎక్కవగా పారితోషికం తీసుకున్నారట. రజనీకాంత్, కమల్‌హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మూండ్రు ముడిచ్చు’. 1970లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. కె.బాలచందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమాకు గానూ కమల్‌హాసన్ తీసుకున్న పారితోషికం రూ.30వేలు కాగా.. రజనీకాంత్ కేవలం రూ.2000 తీసుకున్నారట. శ్రీదేవి మాత్రం రజనీ కంటే ఎక్కువగా రూ.5000 పారితోషికంగా తీసుకున్నారట.
అప్పట్లో కమల్‌హాసన్ పేరున్న నటుడు కాబట్టి వారికంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు.కాగా, ప్రస్తుతం రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ఆయన నెల్సన్ కుమార్ దర్శకత్వంలో జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక కమల్‌హాసన్ ఇటీవలే విక్రమ్ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రంలో నటిస్తున్నారు.