చేజేతులారా బ్లాక్ బస్టర్ మూవీని వదులుకున్న స్టార్ హీరోస్..!!

-

సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అయితే రజనీకాంత్ కెరీయర్ని నిలబెట్టిన చిత్రాలు మాత్రం చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో బాషా చిత్రం కూడా ఒకటి. రజనీకాంత్ స్టైల్, యాక్షన్, డైలాగ్ డెలివరీ ఇలా సరికొత్త కోణంలో ప్రెజెంట్ చేసి మాస్ ఆడియన్స్ కి కూడా మరింత చేరువయ్యారు రజనీకాంత్ . ఈ సినిమాని డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా తెరకెక్కడానికి ముఖ్య కారణం డైరెక్టర్ సురేష్ కృష్ణ కి రజనీకాంత్ ఇచ్చిన ఒక ఐడియా కారణంగానే ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా రీమేక్ చేయాలనుకున్న చిరంజీవి , మోహన్ బాబు చివరి నిమిషంలో ఎందుకు వదులుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బాషా చిత్రంలో రజనీకాంత్ అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఇందులో రజనీకాంత్ తన చెల్లెలి మెడికల్ సీటు కోసం రజనీకాంత్ తన విశ్వరూపాన్ని చూపిస్తారు ఆ సీన్ హమ్ అనే చిత్రంలోనిది. ఇందులో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కూడా నటించారు. ఈ సన్నివేశాన్ని ఆధారంగా తీసుకొని సురేష్ కృష్ణాకు కథను తయారు చేయమని చెప్పాడట రజినీకాంత్.

ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో కథ గురించి తెలుసుకున్న అల్లు అరవింద్ అప్పటికే చిరంజీవి బిగ్ బాస్ సినిమాను చేస్తున్నారు. ఇక బాషా సినిమా గురించి తెలియగానే బిగ్ బాస్ సినిమా అనే టైటిల్ తో బాషా సినిమా అని రీమేక్ చేయాలనుకున్నారు. ఇక రజనీకి మంచి స్నేహితుడైన మోహన్ బాబు సైతం బాషా సినిమా గురించి తెలుసుకొని ఈ సినిమాను ఎలాగైనా తెలుగులో రీమేక్ చేసి విడుదల చేయాలనుకున్నారు. ఈ రీమేక్ రైట్స్ కోసం పాతిక లక్షల రూపాయలు కూడా ఆఫర్ చేశారు. కానీ తమిళ నిర్మాతలు మాత్రం 40 లక్షల రూపాయలు ఇస్తేనే ఈ చిత్రం రైట్స్ ని ఇస్తామని తెలియజేశారట. దీంతో అప్పట్లో అంత మొత్తం చెల్లించాలంటే చాలా ఇబ్బంది పడడంతో ఈ ఇద్దరు వెనక్కి తగ్గారు. కానీ తెలుగులో ఈ సినిమాని విడుదల చేసి రజినీకాంత్ కూడా బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది దీంతో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది రజినీకాంత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version