ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్యన యాషెస్ రెండవ టెస్ట్ మొదటి రోజు జరుగుతోంది. ఇందులో భాగంగా మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ప్రస్తుతం నిలకడగా ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా స్మిత్ మరియు లాబుచెన్ లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. కాగా ఈ ఇన్నింగ్స్ లో స్టీవెన్ స్మిత్ ఒక రికార్డును అందుకున్నాడు. టెస్ట్ లలో 9000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా పేరును గడించాడు. ఈ రికార్డును స్మిత్ 174 ఇన్నింగ్స్ లను ఆడడం ద్వారా చేరుకున్నాడు. కానీ స్మిత్ కన్నా ముందుగా సంగక్కర ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు.
యాషెస్ టెస్ట్: స్టీవెన్ స్మిత్ అరుదైన రికార్డ్…
-