ఆస్పత్రిలో వీధి కుక్కలు.. రోగులకు తప్పని తిప్పలు!

-

ఆ దవాఖాన ముందు వీధి కుక్కలు గుంపులు గుంపులుగా సందడి చేస్తుంటయ్‌! వార్డుల్లో హడావిడిగా తిరుగుతుంటయ్‌! రోగుల బెడ్ల మీద మాంచిగ కునుకులు తీస్తయ్‌! అంటే ఇదేదో కుక్కల దవాఖానే అనుకుంటున్నారా? కాదండి బాబూ.. మనుషుల దవాఖానే. అయితే, ఆ దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యంవల్ల పరిస్థితి అంత దరిద్రంగా తయారయ్యింది.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, పిలిభిత్‌ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలు వార్డుల్లో తిరుగుతున్నా, బెడ్ల మీద పడుకుంటున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆస్పత్రి పరసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయని చెబుతున్నారు.

ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో.. వారు ఆస్పత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు. తమ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి రోగులను అసౌకర్యానికి గురిచేయడం బాధాకరమన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version