మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవను కవర్ చేయడానికి వెళ్లిన పలువురు జర్నలిస్టులపై జరిగిన దాడిని ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈ ఘటనపై స్పందిస్తూ మోహన్ బాబు తీరును తప్పుబట్టారు.
జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు మోహన్ బాబు దగ్గర సమాధానం లేకపోతే సైలెంట్‌గా వెళ్లిపోవాలి. అంతేగానీ ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పారు.జర్నలిస్టు సమాజానికి మోహన్ బాబు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా, జర్నలిస్టులపై దాడి ఘటనలో ఒక రిపోర్టర్ చెవికి తీవ్రమైన గాయమైనట్లు సమాచారం. ఈ ఘటనలో మోహన్ బాబును పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే చాన్స్ ఉందని తెలుస్తోంది.
జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
మోహన్ బాబు దగ్గర సమాధానం లేకపోతే సైలెంట్‌గా వెళ్లిపోవాలి, అంతేగానీ ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు. జర్నలిస్టు సమాజానికి మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి – ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ pic.twitter.com/SXVSTFOu7s
— ChotaNews (@ChotaNewsTelugu) December 11, 2024