‘జగనన్న విద్యా దీవెన’ సరే.. అభివృద్ధి ఏదీ?.. అంబటికి విద్యార్థిని ప్రశ్న

-

‘జగనన్న విద్యాదీవెన సంగతి సరే.. అభివృద్ధి ఏదీ? అమరావతిలో రాజధానిని ఎందుకు నిర్మించడం లేదు’ అని ఓ డిగ్రీ విద్యార్థిని ఏపీ మంత్రి అంబటి రాంబాబును ప్రశ్నించింది. ఊహించని ఈ ప్రశ్నలకు ఆమెను సమాధానపర్చలేక.. బాగా చదువుకోవాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు మంత్రి. ఆదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని 15వ వార్డులో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రితో విద్యార్థిని పిట్టల ప్రవళిక సంభాషణ చర్చనీయాంశమైంది.

మంత్రి.. విద్యార్థిని మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది..

మంత్రి: ప్రభుత్వం నుంచి ‘అమ్మ ఒడి’ అందుతోందిగా..

విద్యార్థిని: ‘జగనన్న విద్యా దీవెన’ అందుతోంది. ఈ సాయం సరే.. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏదీ? మూడు రాజధానులంటున్నారు. రాజధాని ఇక్కడే ఉంటే ఉద్యోగావకాశాలు వస్తాయి కదా.. అమరావతిలోనే రాజధానిని ఎందుకు నిర్మించరు?

మంత్రి: రాజధాని సంగతి తర్వాత.. బాగా చదువుకుంటే అమెరికాలో అయినా ఉద్యోగం చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగావకాశాలు ఉంటాయి.

విద్యార్థిని: వేరే దేశాల్లో ఉద్యోగం చేయాలని నాకు లేదు. రాష్ట్రంలోనే ఉద్యోగం చేస్తా.

విద్యార్థిని చొరవను స్థానికులు ప్రశంసించారు. మరోవైపు ఆమె కుటుంబీకులు ఏ పార్టీ అని వైసీపీ నాయకులు ఆరా తీశారు. వారు వైసీపీకి మద్దతుదారులే అని తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version