విభ‌జ‌న స‌మ‌స్యలపై నేడు ఉప సంఘం భేటీ

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన త‌ర్వాత నెలకొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. కాగ ఈ ఉప సంఘం తొలి సారి నేడు స‌మావేశం కానుంది. ఈ స‌మావేశానికి సంబంధించి కేంద్ర హోం శాఖ స‌ర్వ సిద్ధం చేసింది. నేటి ఉప సంఘం స‌మావేశంలో చ‌ర్చించాల్సిన అజెండా అంశాల‌ను రెండు తెలుగు రాష్ట్రాల‌కు కేంద్ర హోం శాఖ పంపించింది. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించ‌డానికి కావాల్సిన మార్గాల‌పై కూడా రాష్ట్రాల‌తో కేంద్ర హోం శాఖ చ‌ర్చించింది.

ఈ ఉప సంఘం కేంద్ర హోం శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ఆశిష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు అయింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎస్ ఎస్ రావ‌త్ స‌భ్యులుగా ఉన్నారు. కాగ ఈ స‌మావేశం ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ఆన్ లైన్ ద్వారా జ‌ర‌గ‌నుంది. కాగ ఈ స‌మావేశంలో.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత నెల‌కొన్న ముఖ్య‌మైన 5 స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version