ఆహా షో కోసం ఆహా అనిపించేలా రెమ్యునరేషన్ తీసుకుంటున్న సుధీర్..!

-

బుల్లితెరపై సుడిగాలి సుదీర్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే హీరోగా పలు ప్రయత్నాలు చేసినా అంతగా సక్సెస్ కాలేకపోతున్నారని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా పాత సినిమాలలో నటిస్తూ ఉన్నారు సుడిగాలి సుదీర్. ముఖ్యంగా జబర్దస్త్, ఢీ, తదితర ప్రోగ్రాం ల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాకుండా సుధీర్ , రష్మీ జోడి గురించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. అయితే కొన్ని కారణాల చేత ఈటీవీ మల్లెమాల ను వదిలివేయడం జరిగింది సుధీర్.

అటు తరువాత స్టార్ మా లో కనిపించి అక్కడ కొద్ది రోజులు ప్రేక్షకులను బాగానే అలరించారు. కానీ ఆ తర్వాత ఆ షోను కూడా తీసివేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా సుధీర్ ఓటిటిలో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆహా ఓటీటి మిగతా ఓటీటి లకు చాలా భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. త్వరలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో ఒక కామెడీ షో ని ఆహా ప్రసారం చేయనుంది. ఈ షో లో కొంతమంది ప్రముఖ కమెడియన్లు కూడా కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో సుధీర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ షో కోసం సుధీర్ ఒక్కో ఎపిసోడ్ కి రూ.3 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. చాలామంది జబర్దస్త్ కమెడియన్లతో పోలిస్తే సుధీర్ కు ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ దక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు సినిమాలలో నటిస్తూనే భారీగా సంపాదిస్తూ ఉన్నారు సుధీర్. సుధీర్ తన సినిమాలలో సక్సెస్ ఫెయిల్యూర్ సంబంధం లేకుండా దూసుకుపోతున్నారని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రశ్మి, సుధీర్ కలిసి కనీసం ఒక సినిమాలోనైనా నటించాలని అభిమానులు సైతం కోరుకుంటూ ఉంటున్నారు. మరి సుదీర్ కి ఈ షో అయినా సక్సెస్ బాట అందిస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version