సుకన్య సమృద్ధి స్కీమ్‌‌లో చేరుతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!

-

ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులు పెడుతుంటారు. అయితే స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన భవిష్యత్తు లో ఏ ఇబ్బంది రాదు. మీ పాప కి పదేళ్లు దాటాక ముందు ఈ స్కీమ్ లో చేరండి. అరే మీ పాప కి పదేళ్లు దాటిపోయిందా..? అయినా సరే ఏం ఇబ్బంది లేదు. పాప వయసు పదేళ్లు దాటిపోవడం వలన మీరు ఇందులో చేరలేకపోయారా..? అయితే మీకు ఇది శుభవార్త అనే చెప్పాలి.

ఎందుకంటే ఎస్‌బీఐ రీసెర్చ్ కీలక సిఫార్సు చేసింది. అయితే కేంద్రం సుకన్య సమృద్ధి స్కీమ్‌ను ప్రోత్సహించడానికి పలు మార్పులు చేస్తోంది. దీనిలో భాగంగానే కొత్త రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించడానికి కీలక ప్రతిపాదన చేసింది. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు ఫైనాన్సింగ్ కోసం ఎక్కువగా స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పైనే ఆధార పడింది. 2023-24 ఆర్థిక సంవత్సరం లో చిన్న మొత్తాల పొదుపు పథకాల ద్వారా కేంద్రం రూ. 5 లక్షల కోట్లు పొందే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

అందుకనే సుకన్య సమృద్ధి స్కీమ్ కొత్త రిజిస్ట్రేషన్లను తీసుకు రానున్నారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ని 12 ఏళ్ల వరకు వయసు వాళ్లకి కూడా ఉంటోంది. మాములుగా రూల్ అయితే పదేళ్ల వరకు వయసు కలిగిన ఆడ పిల్లల పేరు పైన మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి అయ్యేది.

కానీ ఇప్పుడు ఈ అవకాశం ని కల్పిస్తోంది. ఈ స్కీము మీద 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. 12 ఏళ్ల వరకు వయసు కలిగిన వారికి వన్‌ టైమ్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని తీసుకు వస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో ఈ నిర్ణయం తీసుకోనుందా అనేది చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version