నువ్వే ఒక సైన్యంతో పాటతో ఆకట్టుకుంటున్న సుమంత్ బొర్ర, వెంకటేష్ వుప్పల….

-

మనలో టాలెంట్ ఉండి, చెయ్యాలనే ఆశ ఉంటే ఏదైనా సాధించవచ్చునని చాలా మంది నిరూపించారు.. ఇప్పుడు మరో ఇద్దరు లెజంరిస్ సంగీతంలో తమ టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నారు.. ఆ ఇద్దరు ఎవరు? వారి క్రియేట్ చేసిన పాటల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


నువ్వే ఒక సైన్యమంటూ తమ సైన్యంతో దూసుకొస్తున్నారు వెంకటేష్ వుప్పల, సుమంత్ బొర్రా, హనుమాద్రి శ్రీకాంత్ మరియు తల్లాడ సాయికృష్ణ… వీరిద్దరూ కూడా అతి చిన్నవయసులోనే సంగీత సంచలనంగా మారుతున్న సుమంత్ బొర్రా, వెంకటేష్ వుప్పల…వీరిద్దరూ సొంతంగా నేర్చుకున్న సంగీతంతో అచీవర్స్ అనే సినిమాకి సంగీతమందించారు. ఇక సుమంత్ బొర్రా తన గొంతును అందించారు. ఒకరు తక్కువ.. మరొకరు ఎక్కువ అని లేదు..

ఇద్దరు సంగీతంలో కొత్త కొత్త ట్యూన్ లను కంపోజ్ చేస్తూ దూసుకుపోతున్నారు.. ఇకపోతే వీరిద్దరూ కలిసి పాడిన ఓ పాటకు హనుమాద్రి శ్రీకాంత్ సాహిత్యం అందించారు. దానికి అదనపు సాహిత్యాన్ని సుమంత్ బొర్రా అందించారు. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో వచ్చిన అచీవర్స్ సినిమా ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.. ఈ సందర్బంగా పాటకు అక్కడ మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమాన్ని బిగ్ బాస్ విన్నర్ కౌశల్, తెలంగాణ టూరిజం ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా, సీనియర్ ప్రోడ్యూసర్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ , సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ డా.చింతల శ్రీనివాస్ తదితరులు నిర్వహించారు. ఈ పాట ఆదిత్యమ్యూజిక్ సంస్థ ద్వారా విడుదలవుతుంది.. ఇప్పటివరకు పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి.. ఇలాంటి మరెన్నో పాటలను ప్రేక్షకులకు అందించాలని కోరుకుందాం.. సంగీతంలో కొత్తధనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న.. ఈ యువ రాక్ స్టార్స్ ని ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం.. ఆల్ ది బెస్ట్..

Read more RELATED
Recommended to you

Exit mobile version