యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాను వరసగా 5 సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు. ఇలాంటి లైనప్ ఏ స్టార్ హీరోకు సాధ్యం కాదు. ఇక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తో చేసిన’ఆది పురుష్’ రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా తర్వాత ప్రస్తుతం తన దృష్టి అంతా రెండు ప్రాజెక్ట్ లపై పెట్టాడు. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’లో , మరియు ప్రోజెక్ట్ కె సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. సలార్ మూవీ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ రంగంలోకి దించారట.ఈ విలన్ పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కూడా ఈ షూటింగ్ లో ఉన్నారు.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సలార్ సినిమా పై కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభకు తాను మైమరచి పోయానని చెప్పుకొచ్చాడు. ఇందులోని యాక్షన్ ఎడిసోడ్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయని చెప్పాడు. ఇక ఈ సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది.ఈ సినిమా నుంచి కొత్త షెడ్యూల్ అలాగే సినిమాలో ఫైనల్ షెడ్యూల్ ఈ జనవరి 8 నుంచి మేకర్స్ స్టార్ట్ చేయనున్నారట. ఇక ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ కూడా ఉండబోతుంది అని తెలుస్తోంది. దీని కోసం ప్రశాంత్ నీల్ కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసారట. ఈ సినిమా ను ఈ సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.