Surekha Vani: సురేఖ వాణి రెండో పెళ్లి!? నెట్టింట్లో ఫోటో వైర‌ల్ ..

-

Surekha Vani: సురేఖ వాణి .. అంటే.. తెలియ‌ని వాళ్లు ఉండ‌రంటే.. ఇండస్ట్రీలో తెలియని ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కంటూ ఒక పేరు సంపాదించింది. ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్లతో సమానంగా క్రేజ్ సంపాదించింది. సోషల్ మీడియాలో త‌రుచు త‌న‌ ఫోటోలను పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. ఇదే క్ర‌మంలో సురేఖవాణి రెండో వివాహం గురించి చాలా రోజులుగా చ‌ర్చ జరుగుతూనే ఉంది.

తాజాగా.. ఈ ఆంశం మ‌రోసారి తెర మీదికి వ‌చ్చింది. ఇప్పుడు హ‌ట్ టాపిక్ గా మారింది. ఎందుకు అనుకుంటున్నారా..? ఇటీవ‌ల సురేఖ వాణి సోష‌ల్ మీడియా వేదిక‌గా.. ఈ అమ్మడు బ్లూ కలర్ శారీ లో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ పోస్టు చ‌ర్చ‌నీయంగా మారింది. దానికి కారణం ఫోటోలో సురేఖవాణి మెడలో తాళిబొట్టు కనిపించడమే. సాధారణంగా భర్త చనిపోయిన తరువాత స్త్రీలు తాళిబొట్టు తీసివేస్తారు. కానీ సురేఖ వాణి మెడలో తాళిబొట్టు కనిపిస్తూ ఉండటంతో ఆమె రెండో పెళ్లి చేసుకుందా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లేదంటే.. ఏదైనా పాత్ర అయి ఉండొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది.

surekha vani: Did Surekhavani get married for the second time in secret ..? The actor who raised suspicions with that photo .. pick viral - viral pic: once again surekha vani second

సురేఖ వాణి న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది.. ఆ త‌రువాత సీరియల్స్.. అవ‌కాశాలు రావడంతో.. సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో సురేష్ తేజ అనే దర్శకుడుతో ప్రేమలో పడి ఆయననే పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది. కానీ, దురదృష్టవశాత్తూ సురేష్ తేజ కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్య కారణాలతో మరణించారు.

అయితే చాలా కాలం పాటు భర్త మరణం నుంచి కోలుకోలేక పోయింది సురేఖ వాణి. ఈ త‌రుణంలో మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతుందనే పుకార్లు షికార్లు చేశాయి. తాను మ‌ళ్లీ పెళ్లి చేసుకోవడం లేదు ఖండించింది. ఈ విష‌యాన్ని ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ లో కూడా నేను రెండో పెళ్లి చేసుకోవడం లేదని మళ్ళీ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు బ్లూ కలర్ సారీ ఫోటో షేర్ చేయడంతో ఇప్పుడు ఆమె పెళ్లి వ్యవహారాన్ని మరోసారి తెర మీదకు తీసుకొచ్చినట్టు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news