మరిన్ని మ్యాచ్లకు దూరం కానున్న సూర్య కుమార్ యాదవ్

-

ముంబై ఇండియన్స్ జట్టుకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఐపీఎల్ లో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.మరికొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండడని వార్తలు వినిపిస్తున్నాయి.జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి సూర్యకు ఇంకా ఎన్‌ఓసీ దక్కలేదు .దాంతో గుజరాత్‌ టైటాన్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్‌కు దూరం అయ్యాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో సూర్య లేని లోటు ముంబై ఇండియన్స్ లో స్పష్టంగా కనిపించింది.

Surya Kumar Yadav 

స్పోర్ట్స్ హెర్నియాతో ఇబ్బంది పడుతున్న అతడు జనవరిలో సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం NCA వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న మిస్టర్ 360 ఇంకా పూర్తిగా కోలుకోలేదు. త్వరలో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో సూర్యపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.కాగా, ఐపీఎల్‌లో 139 మ్యాచులు ఆడిన సూర్య కుమార్ యాదవ్.. 3249 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సూర్య చాలా సంవత్సరాలుగా ముంబైకి ఆడుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version