మాకు న్యాయం చేయండి.. ప్రధాని మోదీకి సుశాంత్‌ సోదరి విజ్ఞప్తి..!

-

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై లోతుగా దర్యాప్తు జరిపించాలని అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘మీరు సత్యం వైపే నిలబడతారని నా మనసు చెబుతోంది. మేం చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చాం. మీరు ఈ కేసును పరిశీలించి సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా, పారదర్శంగా విచారణ జరిపించాలని అభ్యర్థిస్తున్నాను. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని శ్వేతా ట్వీట్ చేశారు. ‘‘నేను సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ సోదరిని. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.  మాకు న్యాయం కావాలి’’అంటూ ప్రధాని మోదీ, ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్‌ చేశారు.

కాగా జూన్‌ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. కాగా, సుశాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం వెనుక బాలీవుడ్ పెద్ద‌లు ఉన్నార‌ని కొంద‌రు అంటుంటే, సుశాంత్ తండ్రి కేకే సింగ్ .. రియానే త‌న కుమారుడిని చంపేసింద‌ని ఆరోపిస్తున్నారు. మ‌రి కొంద‌రేమో ఈ కేసు విష‌యంలో పోలీసులు అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని , త‌క్ష‌ణ‌మే సీబీఐకి అప్ప‌గించాల‌ని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version