గుండె ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఆహారపదార్దాలని తీసుకోండి..!

-

ఈ మధ్య కాలంలో గుండె సమస్యలు విపరీతంగా ఎక్కువైపోతున్నాయి. అందుకని గుండె సమస్యల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి పద్ధతులు ఫాలో అవ్వడం, మంచి ఆహారం తీసుకోవడం లాంటివి ఫాలో అవ్వాలి.

లేదంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గుండె ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం. గుండె ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఆహార పదార్థాలను డైట్లో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే మరి గుండె ఆరోగ్యం ఎలా బాగుంటుంది అన్నది చూద్దాం.

ఓట్ మీల్:

ఓట్ మీల్ లో ఫైబర్, బీటా గ్లూకాన్ ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కాబట్టి ఓట్ మీల్ ని తీసుకుంటూ ఉండండి.

సాల్మన్:

సాల్మన్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ని కూడా ఇది తగ్గిస్తుంది. చాలా గుండె సమస్యలు రాకుండా చూసుకుంటుంది.

నట్స్:

నట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా గుండె సమస్యలు రావు. చెడు కొలెస్ట్రాల్ ని కూడా ఇది తొలగిస్తుంది. వాల్ నట్స్, బాదం మొదలైన నట్స్ ని మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. దీంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ కూడా గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే డార్క్ చాక్లెట్ తీసుకునేటప్పుడు అందులో ఎంత కోకో ఉందో చూసుకోవడం చాలా ముఖ్యం. 70 శాతం కంటే కోకో తక్కువగా ఉండేటట్లు చూసుకోండి. ఇలా ఈ విధంగా మీరు ఫాలో అయితే గుండె సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news