మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఇది మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తుంది. ఎర్ర రక్త కణాల్లో హిబోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. దీంతో రక్తం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల మనం నిత్యం ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. ఐరన్ వల్ల కండరాల పనితీరు మెరుగు పడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
* సోయాబీన్స్ లలో ప్రోటీన్లతోపాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. నాన్ వెజ్ తినలేని వారు సోయాబీన్‌ను తినవచ్చు. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి పుష్కలంగా ప్రోటీన్లు, ఐరన్ అందుతాయి.
* ఓట్స్‌ను చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ గా తింటుంటారు. వీటి వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోజంతటికీ కావల్సిన శక్తినిస్తాయి. రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. వీటిని తరచూ తినడం వల్ల ఐరన్ లోపం రాకుండా చూసుకోవచ్చు.
* పుట్టగొడుగుల్లోనూ ప్రోటీన్లు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. కానీ కొందరు వీటిని కొందరు తినేందుకు ఇష్టపడరు. అయితే వీటిని ఆహారంలో భాగం చేసుకోవడంవల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. పుట్టగొడుగులతో సూప్ లేదా కూరలు చేసుకుని తినవచ్చు.
* జీలకర్రను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వంట ఇంటి దినుసులుగా ఉపయోగిస్తున్నారు. ఇవి జీర్ణశక్తిని పెంచడంలో ఎంతగానో దోహదపడతాయి. అలాగే ఐరన్ ఉన్నందున రక్తం బాగా తయారవుతుంది. కనుక వీటిని కూడా తరచూ తీసుకోవాలి.
* పసుపులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. నిత్యం దీన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఐరన్ లోపం రాకుండా చూసుకోవచ్చు.
ఇవే కాకుండా పప్పు దినుసులు, బాదం పప్పు, యాపిల్స్, టమాటాలు, పాలకూర, బ్రొకొలి, మటన్ తదితర ఆహారాలను తరచూ తీసుకుంటున్నా రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు.