పాన్ ఇండియా స్టార్.. అదేనండి మన రెబల్ స్టార్ ప్రభాస్.. మన డార్లింగ్ మనసు ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. ఇక ఆతిథ్యమివ్వడమంటే ప్రభాస్‌కు ఎంతో ఇష్టమనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ ఆతిథ్యం రుచి చూసిన వాళ్లంతా డార్లింగ్‌ను తెగ పొగిడేశారు. తాజాగా ఆ జాబితాలో తమన్నా చేరింది. ప్రభాస్ మనసు వెన్న అంటూ ఈ రెబల్ స్టార్‌పై తెగ ప్రశంసలు కురిపించింది.
‘‘ప్రభాస్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. అతడు తన ఇంటికి వచ్చిన అతిథులను ఎలా చూసుకుంటారో దేశమంతా తెలుసు. ఆయన భోజనానికి పిలిస్తే అందులో కనీసం 30 రకాల వంటకాలు ఉంటాయి. డబ్బు గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే నిజంగా ఒక రాజు ఎలా ఉంటాడో ప్రభాస్‌ను చూస్తే తెలుస్తుంది. ఆయన్ని అభిమానులు ఎంతగా ఇష్టపడతారో అతడికి తెలియదు. అతడు అంత పెద్ద స్టార్ అయినా.. చాలా సాధారణంగా ఉంటాడు’’ అంటూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించింది తమన్నా.
ఇప్పటికే ప్రభాస్ అతిథి మర్యాదలకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సూర్య, పూజా హెగ్డే, శ్రుతి హాసన్, శ్రద్ధా కపూర్, కృతి సనన్ ‘ఆదరహో’ అంటూ మెచ్చుకున్న సంగతి తెలిసిందే.