పెళ్లిచూపులు సినిమాతో డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. హీరో విజయ్ దేవరకొండ కెరియర్ ఎక్కడికో వెళ్లిపోయిన విషయం తెలిసిందే.. డైరెక్టర్గా అప్పటివరకు తరుణ్ భాస్కర్ ఇండస్ట్రీలో కొంతవరకు పరిచయం ఉన్న వ్యక్తి కానీ సినిమా అవకాశము మాత్రం ఎవరు ఇవ్వలేదు. తాను రాసుకున్న పెళ్లిచూపులు స్క్రిప్ట్ ని అఖిల్, వరుణ్ తేజ్ కి వినిపించినా కూడా వారు నో చెప్పారు. దాంతో తనకు వేరే ఆప్షన్ లేక థియేటర్ ఆర్టిస్ట్ గా వున్న విజయ్ దేవరకొండకు హీరోగా అవకాశం ఇచ్చాడు. అయితే ఈ సినిమాకు అంతకు ముందు వరకు కన్యారాశి అనే పేరు పెట్టుకున్నాడట తరుణ్ భాస్కర్.
ఒకసారి మంచు లక్ష్మి.. తర్వాత ఏం సినిమా చేయబోతున్నావని అడగగా.. కన్యారాశి సినిమా గురించి చెప్పాడట.. దాంతో ఆవిడకు కథ బాగా నచ్చి అప్పటికప్పుడే ఒక చెక్కు రాసిచ్చి.. తరుణ్ భాస్కర్ సినిమా చేసి పెట్టమని అడిగిందట.. కానీ అనుకోకుండా విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్గా టైటిల్ కూడా మారి పెళ్లిచూపులుగా ఒక హిట్ సినిమా అయితే వచ్చింది.. మంచు లక్ష్మి ఇచ్చిన చెక్కు ఇప్పటికీ తన దగ్గరే ఉందని.. ఎప్పటికైనా తనకు మంచి సినిమా చేసి పెట్టమని చెప్పిందని.. కానీ ఆవిడకు చెక్ రిటర్న్ చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమె తీసుకోవడం లేదు అంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే కేవలం షార్ట్ ఫిలిమ్స్ తీస్తూనే తన ప్రతిభ ఏంటో చాటుకున్న ఈయన పెళ్లిచూపులు సినిమా తీసి డైరెక్టర్గా తన గుర్తింపును చాటాడు. ఇక వెంకటేష్ తో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా ఆ మధ్య తెలిపిన విషయం తెలిసిందే.కానీకరోనా కారణంగా అది వాయిదా పడింది..అయితే ఇప్పటికీ దానికి సంబంధించిన ఎలాంటి ప్రకటన లేకపోవడం గమనార్హం.