మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం

-

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం పాలయింది. ముందు నుండీ ఈ ఎన్నికల్లో తెలుగుదేశానికి చెప్పుకోదగ్గ స్థానాలు వస్తాయని చంద్రబాబు సహా పార్టీ నేతలు భావిన్చారుయ్. కానీ చంద్రబాబు, అచ్చెన్నాయుడు సొంత జిల్లాలలో సైతం వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరు మినహా ఎక్కడా వైసీపీకి టిడిపి పోటీ ఇవ్వలేకపోయింది.

టీడీపీకి, నందమూరి కుటుంబానికి సైతం పెట్టని కోట అని భావించే హిందూపురంలో సైతం పార్టీని బాలయ్య గట్టెంచలేకపోయారు.  కార్పొరేషన్లలో సైతం టీడీపీ ప్రభావం చూపలేకపోయింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు ప్రచారం చేసిన కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ లలో సైతం వైసీపీ సత్తా చాటింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం పాలయిందనే చెప్పాలి. మరి దీని మీద చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version