ఏపీ మంత్రికి షాక్ ఇచ్చిన టీడీపీ… పోలీసులు ఏం చేస్తారు…?

-

ఆంధ్రప్రదేశ్ లో కొత్త కరోనా వేరియంట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వేరియంట్ కి సంబంధించి టీడీపీ చేస్తున్న విమర్శలు అధికార పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా అరండల్ పేట స్టేషన్ లో మంత్రి సిదిరి అప్రలరాజు పై ఫిర్యాదు చేసారు టీడీపీ నేతలు. రాష్ట్రం లో N440K వైరస్ విజృంభిస్తుందని ప్రచారం చేసారని మండిపడ్డారు.

మంత్రి వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రజలు భయాబ్రాంతులకు గురౌతున్నారు అని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసిన మంత్రి పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. అరండల్ పేట సిఐ కు బొంగరాలబీడు చెందిన దేవదాసు కాలే ఫిర్యాదు చేసారు. టీడీపీనేతలు శ్రావణ కుమార్, కోవెలమూడి రవీంద్ర, కనపర్తి, చిట్టిబాబు, మానుకొండ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version