ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి సొంత సర్వే : చూస్తారా..!

తెలుగుదేశం పార్టీ ధీమాకు కారణమైన సర్వే – విశ్లేషణ చూడండి. ఇది టిడిపి సొంత సర్వే. దీన్ని ‘సెంట్రల్‌ టిడిపి ఇన్షర్మేషన్‌ సెంటర్‌’ పేరుతో అధినేతకు అందజేసారు. సహజంగానే దీని ఫలితాలేంటో మీరు ఊహించవచ్చు. అయినా కానీ, వారి విశ్లేషణాసామర్థ్యం, మీ అంచనాలు ఎక్కడ, ఎలా ఉన్నాయో పరిశీలించండి. ఆ సర్వే తాలూకు ఒరిజినల్‌ ప్రతిని కూడా మీకు అందిస్తున్నాం. ‘మనలోకం’ పాఠకులకిది ప్రత్యేకం.

టిడిపి అధినేత స్వంతంగా చేయించిన సర్వే, దాని ఫలితాలు ఎట్టకేలకు బయటపడ్డాయి. బహుశా దీన్ని చంద్రబాబు బాగా నమ్మిఉంటారు. సరే.. ఎలా అయితేనేమి? అధికార టిడిపికి మరోసారి పట్టం ఖాయమని ఈ విశ్లేషణ తెలియజేస్తోంది. అంతే కాకుండా పార్లమెంటు సీట్లు కూడా గణనీయంగా వస్తాయని చెపుతోంది. అందుకే బాబుగారు యూపీఏ హడావుడిలో తిరుగుతున్నారు. స్థూలంగా కొన్ని వివరాలు చూడండి. వివరంగా కావాలంటే కింద ఇచ్చిన ప్రతిని మీరు పరిశీలించవచ్చు.

TDP Own Survey On AP Elections 2019

అసెంబ్లీ ఎన్నికల సర్వే : 25 లోకసభ నియోజకవర్గాల పరధిలోని 175 శాసనసభ సీట్లలో, తెలుగుదేశంకు 91 వస్తాయని, వైసీపీకి 54, జనసేనకు 1, కాగా ఎటూ చెప్పలేనివి 29 గా ఈ సర్వే తేల్చింది.

అయితే, ఈ 29లో మళ్లీ టిడిపి వైపు మొగ్గుచూపేవిగా 21, వైసీపికి 8 గా నిర్ణయించారు. అంటే మొత్తంగా తెలుగుదేశంకు 112 వస్తాయని వారి అంచనా. అలాగే వైసీపికి 62 వచ్చే అవకాశముందని చెప్పారు.

పార్లమెంట్‌ ఎన్నికల సర్వే : 25 పార్లమెంటు సీట్లకుగానూ, టిడిపికి 16, వైసీపీకి 7, టైట్‌గా ఉన్నవి 2 గా చెప్పారు. అయితే ఈ రెండు ఎటువైపు మొగ్గు చూపుతాయో సర్వే చెప్పలేకపోయింది. సో… 112 సీట్లతో ఇక్కడ అధికారం సంపాదించి, 16 సీట్లతో కేంద్రంలో బేరాలు సాగించవచ్చని చంద్రబాబు నాయుడి గారి ఆలోచనగా అస్మదీయుల మాట.
Info Centre Analysis