ఏపీలోని వాలంటీర్లకు టీడీపీ పార్టీ గుడ్ న్యూస్

-

ఏపీలోని వాలంటీర్లకు టీడీపీ పార్టీ గుడ్ న్యూస్ చెప్పింది. వాలంటీర్ల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో సీఈఓ ను సోమవారం కలిసిన వర్ల రామయ్య, టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్ల ఉద్యోగాలు తీసేస్తారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్ల ఉద్యోగాలు చంద్రబాబు తీసేయరని వెల్లడించారు. అలాగే, టిడిపి అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన రీతిలో ప్రోత్సాహకాలు కల్పిస్తామని ప్రకటించారు. గ్రామ, వార్డు వాలంటీర్లకు టిడిపి అధికారంలోకి రాగానే ఉద్యోగ భద్రత కూడా ఉంటుందని వర్ల రామయ్య భరోసా ఇచ్చారు. ఇది తాను ఇస్తున్న హామీ కాదని, చంద్రబాబు నిర్ణయాన్నే తాను చెప్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version