కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు టిడిపి మహిళా కార్యకర్తల యత్నం

-

గుడివాడ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని క్షమాపణ చెప్పాలంటూ గుడివాడలో టిడిపి మహిళా కార్యకర్తలు విశ్వ ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళలను కించపరిచిన కొడాలి నాని క్షమాపణ చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయించి టిడిపి మహిళా కార్యకర్తలు ధర్నా చేపట్టారు.

పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అంతకుముందు గుడివాడ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి మహిళలు ధర్నాా చేపట్టారు. కొడాలి నాని, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించే వద్దని పోలీసులు ఎంతగా చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొడాలి నాని ఆదేశాలతోనే తమను వేధిస్తున్నారంటూ మహిళలు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version