రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం టీచర్ల పడిగాపులు.. హరీశ్ రావు ట్వీట్ వైరల్

-

రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఉపాధ్యాయులు పడిగాపులు గాస్తున్నారని, ఎప్పుడు వస్తాయో తెలియక విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన దాదాపు 8 వేల మంది పీఎఫ్, గ్రాట్యుటీ, ఎల్ఐసీ, కమ్యుటేషన్, సరెండర్ లీవ్ తదితర ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.

ఇదిలాఉండగా, గతేడాది మార్చిలో రిటైర్మెంట్ అయిన 7,995 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి సగటున రూ.60 నుంచి 70 లక్షల మేర ప్రభుత్వం నుంచి చెల్లింపులు జరుగాల్సి ఉంది. గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఎల్ఐసీ, కమ్యూటేషన్ బిల్లులన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి.రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలంటే దాదాపు రూ.5వేల కోట్లు అవసరం పడుతాయి.ఉద్యోగులు ఇంతకాలంగా దాచుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని మాజీ మంత్రి సీరియస్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version