రోజా ఇంటికి కేసీఆర్‌.. రీజ‌న్ ఇదే…!

4510

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమ‌వారం మ‌రో సంచ‌ల‌న ప‌ర్య‌ట‌న‌కు రెడీ అయ్యారు. కేసీఆర్ సినీన‌టి, న‌గ‌రి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి కూడా వెళ్ల‌నున్నారు.ఈ ప్ర‌క‌ట‌న అటు సినిమా, ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన పర్యటనలు చేస్తున్నారు. ఆదివారం కేసీఆర్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ ఇంటికి స్వ‌యంగా వెళ్లారు. కొద్దిసేపు ఆయ‌న‌తో ముచ్చ‌టించ‌డంతో పాటు ఆయ‌న ఆరోగ్య విష‌యాలు అడిగి తెలుసుకున్న కేసీఆర్ విశ్వ‌నాథ్ ఇప్పుడు సిన‌మా తీస్తే ఆ సినిమాకు తానే నిర్మాత‌గా ఉంటాన‌ని కూడా ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న అటు సినిమా, ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

ఇదిలా ఉండ‌గానే ఆయ‌న సోమ‌వారం మ‌రో సంచ‌ల‌న ప‌ర్య‌ట‌న‌కు రెడీ అయ్యారు. ఆయ‌న కుటుంబ స‌మేతంగా ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించుకోనున్నారు. అది కామ‌నే అయినా కేసీఆర్ సినీన‌టి, న‌గ‌రి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి కూడా వెళ్ల‌నున్నారు. సోమ‌వారం కేసీఆర్‌ తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షే
త్ర‌మైన కంచిలోని అత్తి వ‌ర‌ద‌రాజ పెరుమాళ్ స్వామిని ద‌ర్శించుకోనున్నారు. కేసీఆర్ కుటుంబ స‌మేతంగా చేసే చేసే ఈ ప‌ర్య‌ట‌న‌లో తిరుమ‌ల శ్రీవారిని సైతం ఆయ‌న ద‌ర్శించుకోనున్నారు.

రేణిగుంట వ‌ర‌కు ప్ర‌త్యేక విమానంలో వెళ్లిన కేసీఆర్ అక్క‌డ నుంచి రోడ్డుమార్గాన త‌మిళ‌నాడుకు చేరుకుంటారు. ఈ క్ర‌మంలోనే మార్గ‌మ‌ధ్యంలో ఆయ‌న రోజా ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకుంటారు. మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా తిరుగుప్ర‌యాణంలో రోజా ఇంటిలోనే చేస్తార‌ని స‌మాచారం. ఇక రోజా కేసీఆర్ త‌న ఇంటికి వ‌స్తోన్న సంద‌ర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీకి చెందిన ప‌లువురు మంత్రులు కేసీఆర్‌కు స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు.

ఇక కేసీఆర్ రోజా ఇంటికి ప్ర‌త్యేకంగా ఎందుకు వెళుతున్నారు ?  అన్న‌ది కూడా హాట్‌టాపిక్‌గానే ఉంది. నిన్న‌టికి నిన్న కె.విశ్వ‌నాథ్ ఇంటికి వెళ్లిన కేసీఆర్ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం చేస్తానంటే తాను ఆ సినిమా నిర్మిస్తాన‌ని చెప్పారు. తెలంగాణ చ‌రిత్ర నేప‌థ్యంలో ఓ సినిమా తీయాల‌న్న ఆలోచ‌న కేసీఆర్‌కు ఉంద‌ని… ఆ సినిమాకు విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తే రోజా అందులో ఓ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. తాజాగా రోజా ఇంటికి కేసీఆర్ వెళుతోన్న సంద‌ర్భంగా ఈ అంశం వీరి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు.