తెలంగాణాలో భారీగా కరోనా కేసుల నమోదు

-

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,256 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొద్ది సేపటి క్రితం బులెటిన్ విడుదల చేసింది. అలానే ఈ కరోనా మహమ్మారి కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 80,751కు పెరిగింది. ఇప్పటివరకు 637 మంది మరణించారు. ఇక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 22,528 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటి వరకు 57,586 మంది కరోనా వైరస్ సోకిన వారు కోలుకున్నారు.

corona

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెహెచ్‌ఎంసీ పరిధిలో 389 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. సంగారెడ్డి జిల్లాలో 74, రంగారెడ్డి జిల్లాలో 86, వరంగల్‌ అర్బన్ జిల్లాలో 67 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 11,609 కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్ట్ ల ద్వారా నుంచే 1,256 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 6,24,840కు చేరింది. ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల్లో మరో 1,700 మంది ఫలితాలు తేలాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 39 చోట్ల కరోనా పరీక్షలు జరుపుతున్నట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version