అల్లు అర్జున్ కేసుపై తెలంగాణ డీజీపీ జితేందర్ సంచలన ప్రకటన చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై డీజీపీ జితేందర్ స్పందించారు. అల్లు అర్జున్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది… నిందితులందిరిపై కేసులు నమోదు చేశారన్నారు. ఈ కేసులో చట్టం ప్రకారం ముందుకు వెళతామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన క్రైమ్ రేటును తెలంగాణ పోలీసు శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 2.34,158 కేసులు నమోదు అయ్యాయని డీజీపీ జితేందర్ తెలిపారు. గత ఏడాదితో పోలీస్తే 2024లో మొత్తంగా 9.87 శాతం కేసులు పెరిగాయని వెల్లడించారు. అంతేకాకుండా ఈ సంవత్సరం 1,942 డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయని వివరించారు.
ఇక 2024 వార్షిక క్రైమ్ రిపోర్టును ఆయన విడుదల చేస్తూ రూ.142.50 కోట్ల విలువైన మాదక ద్ర్యవ్యాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఒకటి, రెండు ఘటనలు మినహా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ తెలిపారు.
సంధ్య థియేటర్ ఘటనపై డీజీపీ జితేందర్..
అల్లు అర్జున్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది
నిందితులందిరిపై కేసులు నమోదు చేశారు pic.twitter.com/aEIe8J8iEt
— BIG TV Breaking News (@bigtvtelugu) December 29, 2024