తెలంగాణాకు వరంలా మారిన ఏపీ మద్య నిషేధం

-

ఆంధ్రప్రదేశ్‌లో ధరలు భారీగా పెరగడంతో తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగిపోతోంది. సరిహద్దు జిల్లాల నుంచి లక్షల రూపాయల మద్యం తెలంగాణ నుండి ఏపీకి నిత్యం మద్యం తరలిపోతోంది. అలా ఒక రకంగా అబ్కారీ శాఖ ఖజానాకు కాసుల వర్షం కురుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ తరువాత అత్యధికంగా ఆదాయం తెచ్చి పెట్టే వనరుగా అబ్కారీ శాఖ మారింది.

2014-15 ఏడాదిలో రాష్ట్ర ఆదాయం 10వేల 500 కోట్లు కాగా 2019-20 నాటికి దాదాపు 22 వేల కోట్ల రూపాయలు రాబడి వచ్చింది. అదీ కాక రాష్ట్రం విడి పోయిన తరువాత గుడుంబా కట్టడితో ఒక్కసారిగా రెండువేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చి చేరింది. మద్యం ధరలు పెంచడం, అక్రమ మద్యాన్ని కట్టడి చేయడం లాంటి చర్యలతో రాబడి అంచనాలు మించి పెరుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన ఆరేళ్లలో మద్యం విక్రయాలు రెట్టింపునకు పెరగ్గా….రాబడి కూడా రెండింతలైంది. 2020-21 ఏడాదిలో అబ్కారీ ఆదాయం 25వేలు కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version