తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ముఖ్యమైన సూచనలు..!

-

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించబడిన లాక్‌డౌన్‌ 5.0 జూన్‌ 30వ తేదీతో ముగుస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కేంద్రం అనేక కార్యకలాపాలకు ఆంక్షలను సడలించింది. ఈ క్రమంలో జూన్‌ 8వ తేదీ నుంచి మరిన్ని ఆంక్షలను సడలించనున్నారు. అటు ఆధ్యాత్మిక ప్రదేశాలతోపాటు, ఇటు మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లను ఓపెన్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పలు ముఖ్యమైన సూచనలు జారీ చేసింది.

* హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, దేవాలయాల్లో శానిటైజర్లు, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలి.

* లోపలికి వెళ్లేందుకు ఒక మార్గం, బయటకు వచ్చేందుకు మరొక మార్గంను ఏర్పాటు చేయాలి.

* లిఫ్టుల్లో, ఎస్కలేటర్లపై, లోపలి ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.

* హోటల్‌కు వచ్చే అతిథుల పూర్తి వివరాలు సేకరించాలి. వారి ఆరోగ్య స్థితిపై వారు ఇచ్చే స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి.

* రెస్టారెంట్లలో టేబుల్స్‌ మధ్య భౌతిక దూరం ఉండాలి.

* ఏసీ 24 నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలి. మాల్స్‌లో చిన్నారులను ఆడుకునే స్థలాలను మూసి ఉంచాలి.

* రెస్టారెంట్ల వారు వినియోగదారులను ఆహార పార్శిళ్లు తీసుకు వెళ్లేవిధంగా ప్రోత్సహించాలి. అలాగే రెస్టారెంట్‌లో సీటింగ్‌ కెపాసిటీలో ఎప్పుడూ 50 శాతానికి కస్టమర్లు మించరాదు.

* కంటెయిన్మెంట్‌ జోన్లలో ఉన్నవారు బయటకు రాకూడదు.

* ఇండ్ల నుంచి పనిచేసే వారిని ప్రోత్సహించాలి. దాన్ని సెలవుగా పరిగణించరాదు.

* ఆఫీసుల్లో పనివేళలు దశలవారీగా ఉండాలి.

* వాహనాలను శానిటైజేషన్‌ చేసుకోవాలి.

* కార్యాలయాల్లో పనిచేసే చోట ఒకటి రెండు కరోనా కేసులు నమోదైతే ఆఫీసులను శుభ్రం చేయాలి. తరువాతే ఉద్యోగులను అనుమతించాలి. అదే కేసులు ఎక్కువగా నమోదైతే ఆఫీసును మూసేయాలి. మళ్లీ అనుమతి ఇచ్చే వరకు ఆఫీసులను తెరవకూడదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version