నూతన సంవత్సరం వేళ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. ఇందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. నేటి నుంచి సరిగ్గా నెల రోజుల్లో మొత్తం ఎన్నిల ప్ర్రక్రియ ముగిసే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి ప్రణాళికను రూపొందించింది. దీంతో ఎన్నికల పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహించనున్నారు
. ఇందులో భాగంగా తొలి విడత ఎన్నికల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21వరకు, రెండో విడత ఈ నెల 11న ప్రారంభమై 25, మూడో విడత 16న ప్రారంభమై 30న ముగియనుంది. రాష్ట్రంలో మొత్తం 12,732 గ్రామ పంచాయతీలు.. 1,13,170 వార్డుల్లో ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,13, 190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు.