ఫెయిల్ అవుతానేమో అని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి… కానీ 892 మార్కులతో పాస్ !

-

ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. పాస్ అయిన వారింట సంతోషాలు వెల్లివిరిస్తే , ఫెయిల్ అయిన వారింట దుఃఖం ఉంటుంది. ఇంతవరకు అయితే ఓకే కానీ రాష్ట్రంలో ఒకరిద్దరి ఇళ్లల్లో మాత్రం విషాధచాయలు అలముకున్నాయి. ఇది చాలా దారుణమని చెప్పుకోవాలి, ప్రజ్వల అనే విద్యార్థి ఫెయిల్ అయ్యానని ప్రాణం తీసుకోగా .. గుగులోతు కృష్ణ అనే విద్యార్థి మాత్రం ఫలితాలు రాకముందే ఎక్కడ ఫెయిల్ అవుతానో అని తన ప్రాణాలను తీసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా కె సముద్రం మండలం బోడగుట్టతండాలో నివసించే కృష్ణ ఇంటర్ బైపీసీ చదివేవాడు. అయితే ఇంటీ పరీక్షలు రాసిన అనంతరం తనకు ఎందుకో సందేహం కలిగింది.

 

ఎక్కడ ఇంటర్ లో ఫెయిల్ అవుతానో అని లేనిపోని ఆలోచనలతో సూసైడ్ చేసుకున్నాడు. ఇది జరిగింది పరీక్షకు రాసిన అంతరం ఏప్రిల్ 10వ తేదీన, కాగా నేడు ఫలితాలు వచ్చాక చూస్తే కృష్ణ ఏకంగా 892 మార్కులతో పాస్ అయ్యి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఈ మార్కులు చుసిన కృష్ణ తల్లితండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version