ఉద్యోగాల సృష్టిలో నం.1 తెలంగాణ – సీఎం రేవంత్

-

ఉద్యోగాల సృష్టిలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయిలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం HCL టెక్ KRC క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. విద్యుత్ వాహనాలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్,బయోటెక్ వంటి రంగాల్లో పెట్టుబడులను చూసి హైదరాబాద్ ఈజ్ అన్‌స్టాపబుల్ అంటున్నారని వివరించారు.

రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెబుతుంటే అందరూ పాజిబుల్ కాదని అంటున్నారని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. గతేడాది 41వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు.రాష్ట్రంలో పెట్టుబడులకు చాలా అనుకూలమని, పెట్టుబడిదారులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఇన్వెస్టర్లను పిలుపునిచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version