ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈనెల 11న జరగబోతోంది పలు కీలకమైన అంశాల గురించి చర్చించి ఆమోదం తెలపబోతున్నారు. సచివాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకి సమావేశం జరిగే విధంగా ప్రాథమిక షెడ్యూలు రూపొందింది నిర్దిష్టమైన ఎజెండా రూపొందిన ఉన్నది ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ని లాంచ్ లంగా భద్రాచలంలో ఈ నెల 11న ప్రారంభించనున్న నేపథ్యంలో హడ్కో నుండి 3000 రుణాలు సమకూర్చడానికి హౌసింగ్ బోర్డుకి ప్రభుత్వం ఇప్పటికి అనుమతించింది.
ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదాన్ని తెలపబోతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలో మహాలక్ష్మి లోని నెలకి 2500 చొప్పున మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడం పైన క్యాబినెట్ చర్చించి ఆమోదాన్ని పొందుతుంది. వీటికి తోడు విధానపరమైన మరికొన్ని అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రాబోతున్నాయి. త్వరలో లోక్సభ ఎన్నికల కోడ్ రాబోతున్నట్లు ఈలోపే ఆరు గ్యారెంటీలో పెండింగ్ ఉన్నవాటికి ఆమోదాన్ని పొందబోతున్నట్లు తెలుస్తోంది.