సాయంత్రానికి తేలనున్న ఎమ్మెల్సీ ఫలితాలు.. చివరికి దాకా ముగ్గురే బరిలో ?

-

తెలంగాణలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఈ రోజు సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 17వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన ఈ పోలింగ్ ప్రక్రియ అంతకంతకూ ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డి  ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు చివరిగా మిగిలారు. వీరిలో 9110 తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణి ముందు స్థానంలో ఉండగా రెండో స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ బీజేపీ నేత రామచంద్రరావు ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. నల్గొండ స్థానంలో కూడా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలారు ఇక్కడ కూడా 23468 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. తర్వాత రెండవ స్థానంలో తీన్మార్ మల్లన్న మూడో స్థానంలో కోదండరామ్ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లోగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version