కామారెడ్డి జిల్లా : ఆశావర్కర్లకు మోబైల్స్ ఆందించే రాష్ట్ర స్థాయి కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో ప్రారంభం కావడం శుభసూచకమన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల మందికి స్మార్ట్ ఫోన్లను ఆశా కార్యకర్తలకివ్వబోతున్నామని ప్రకటన చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఆశ కార్యకర్తలకు వేతనాలు పెంచిన ప్రభుత్వం.. టీఆర్ఎస్ ప్రభుత్వం అని వెల్లడించారు.
ఆశావర్కర్ల సేవలు ఎనలేనివన్నారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో ఆశా వర్కర్లలకు 4 వేల రూపాయల వేతనముంటే.. అదే తెలంగాణలో మాత 9750 రూపాయల వేతనముందని గుర్తు చేశారు. ప్రతి నెలా మొదటి వారంలోనే ఆశావర్కర్లలకు వేతనం అందిస్తున్న ప్రభుత్వమిదన్నారు.
ఆశా కార్యకర్తల పనితీరుని ప్రభుత్వం గుర్తించడం వల్లే వారికి స్మార్ట్ ఫోన్స్, సిమ్ కార్డులను పంపిణీ చేస్తోందని.. అశా కార్యకర్తలు కరోనా కాలంలో బాగా పనిచేశారని చెప్పారు. కరోనా, ఫీవర్ సర్వేలు సక్సెస్ ఫుల్ గా చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఆశా కార్యకర్తలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని.. జాతీయ స్థాయిలో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి కాయకాల్ప అవార్డు రావడం సంతోషమని పేర్కొన్నారు.