ఆరున్నరేళ్ల కాలంలో హైదరాబాద్ మెట్రోలో 50 కోట్ల ప్రయాణికులు

-

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభమై ఆరున్నరేళ్లు అయింది. ఈ ఆరున్నరేళ్ల కాలంలో మెట్రో 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం రోజూ సగటున 5 లక్షల ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. చారిత్రకమైలుని చేరుకున్న దృష్ట్యా కస్టమర్‌, గ్రీన్‌మైల్‌ లాయల్టీ క్లబ్‌ను ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ఈరోజు ప్రారంభించనుంది.

హైదరాబాద్‌లో మెట్రో రైలును 2017 నవంబరు 29న ప్రారంభించగా.. తొలుత మియాపూర్‌ నుంచి అమీర్‌పేట- నాగోల్‌ మార్గంలో సేవలు మొదలైంది. 5 దశల్లో పూర్తిగా 69.2 కి.మీ. అందుబాటులోకి వచ్చింది. కారిడార్‌-1 మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ మార్గంలో రెండున్నర లక్షల మంది నిత్యం ప్రయాణిస్తుండగా.. ఇదే స్థాయిలో కారిడార్‌-3 నాగోల్‌ నుంచి రాయదుర్గంలో రష్ ఎక్కువగా ఉంటుంది. కారిడార్‌-2 జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు సగం మాత్రమే ఆపరేషన్‌లోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా ఉంది. ఉదయం, సాయంత్రం  మెట్రో రైళ్లు చాలక ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. సరిపడా మెట్రో రైళ్లు లేకపోవడమే దీనికి కారణం.

Read more RELATED
Recommended to you

Exit mobile version