రేవంత్‌ కు షాక్‌…అశోక్ నగర్ అష్టదిగ్బంధనం..!

-

తెలంగాణ సీఎం రేవంత్‌ కు షాక్‌ ఇచ్చారు నిరుద్యోగులు. తమ డిమాండ్లు సాధించుకునేలా శనివారం రాత్రి నిరసనలు తెలుపుతూ… అశోక్ నగర్ అష్టదిగ్బంధనం చేశారు. అశోక్ నగర్ లో గ్రూప్స్ అభ్యర్థుల మెరుపు నిరసన తెలిపారు. గ్రూప్ 2, 3 పోస్ట్ లు పెంచి, పరీక్షలు డిసెంబర్ లో పెట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ…. నిన్న రాత్రిపూట నిరసనలు చేశారు. దీంతో పోలీసులు వారిని కంట్రోల్‌ చేసే ప్రయత్నం చేశారు.

A large number of unemployed youth, including Group II and DSC aspirants staged a protest against the state government at Ashok Nagar in Hyderabad

ఇక ఈ సంఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల మొర ఆలకించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భేషజాలకు పోకుండా, వారి జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యకు ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నానని తెలిపారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలుచుకొని వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

అంతేగాని వారిని రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడి అబాసుపాలు కాకండి. వారు దైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించకండన్నారు. పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం ఫలించక పొగా, అది మరింత ఉదృతం అవుతుంది. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేసినా, వారిపై భౌతిక దాడులకు పాల్పడినా మేము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version