ట్రాన్స్ జెండర్ను పెళ్లి చేసుకున్న కరీంనగర్ యువకుడు

-

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో శుక్రవారం ఓ యువకుడు ట్రాన్స్ జెండర్ ను వివాహం చేసుకున్నాడు. వీణవంకకు చెందిన దివ్య కొంత కాలంగా జమ్మికుంట పట్టణంలో జీవనం సాగిస్తుంది. జగిత్యాలలో నివాసం ఉన్నప్పుడు దివ్యకు అక్కడే ఉన్న అర్షద్ తో పరిచయం అయింది. అర్షద్ ఆమె పెళ్లి చేసుకుంటానని రెండు మూడు సార్లు ప్రపోజ్ చేశాడు.

అయితే మొదట్లో నిరాకరించిన దివ్య ను ఒప్పించేందుకు గురువారం జమ్మికుంటకు వచ్చిన అర్షద్ హర్షిత్ గా మారి ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు. దివ్య సర్జరీ కూడా చేయించుకున్న తర్వాతే హర్షిత్ ప్రపోజల్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

కారు డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న హర్షిత్ తన పేరు మార్చుకొని భార్య చెప్పినట్టుగా నడుచుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని చెబుతున్నాడు. వివాహ బంధంతో ఒక్కటైన తాము ఆదర్శవంతమైన జీవితం గడుపుతామని దివ్య పేర్కొంది. శుక్రవారం జమ్మికుంటలో ఒక్కటైన ఈ జంట ఇల్లంతకుంట రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అన్ని జంటలలాగే తాము ఆదర్శవంతంగా జీవిస్తామని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version