గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం.. జస్ట్​లో మిస్ అయ్యారు

-

ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్​ను తప్పించబోయి.. అదుపుతప్పిన కంటైనర్​ డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్​పై ఉన్న వారికి చావు జస్ట్​లో మిస్ అయి వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒళ్లుగగుర్పొడిచే ఈ ప్రమాదంలో అందరూ ప్రాణాలతో బయటపడటం అదృష్టమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పోలీసుల, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వైపు కంటెయినర్‌ వెళ్తోంది. నేరడిగొండ మండలం చించోలికి చెందిన జంగు, కృష్ణ, సంతోష్‌ మావల మండలం వాఘాపూర్‌లో అంత్యక్రియలకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. సీతాగోంది వద్ద ద్విచక్ర వాహనం రోడ్డు దాటేందుకు మరలుతుండగా.. అదే సమయంలో వేగంగా వస్తున్న కంటైనర్‌ డ్రైవర్‌ వారిని గమనించి వాహనాన్ని పక్కకు తిప్పాడు. అదుపుతప్పిన కంటెయినర్‌ డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. డ్రైవర్ రషీద్‌ ఖాన్‌కు తీవ్రగాయాలు కాగా, క్లీనర్‌ ఆబిద్‌ ఖాన్‌కు స్పల్ప గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారులు కింద పడి చిన్న గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version