నేడు రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన

-

సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు వచ్చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుది విడత ప్రచారం కోసం రాష్ట్రానికి జాతీయ నేతలు వరుస కడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ నేతలను రంగంలోకి దింపి వారితో విస్తృత ప్రచారం చేయిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు.

తాజాగా అమిత్ షా ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కు మద్దతుగా. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. సభ కోసం బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 10వ తేదీన నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని బీజేపీ జాతీయ మాజీ కార్యదర్శి మురళీధర్ రావు అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version