తెలంగాణ బీజేపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు ఎవరు అవుతారు అని అన్ధహరు చర్చిస్తున్న వేల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన విషయాలు బయటపెట్టారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను అని క్లారిటీ ఇచ్చారు. అలాగే నాకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించింది అని పేర్కొన ఆయన.. ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా అని స్పష్టం చేసాడు.
అయితే నాకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనేది ఊహాగానాలే అని కొట్టిపారేసిన బండి.. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి నాకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయి అని అన్నారు. అయితే పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారు. కాబట్టి హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. అలాగే ఈ విషయంలో మీడియా సహకరించాలని చేతులెత్తి జోడిస్తున్నా అని బండి సంజయ్ అన్నారు.